కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం కొత్తపల్లి పంచాయతీ పరిధిలో కూటమి ప్రభుత్వ హయాంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక వసతుల కల్పనపై ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి ప్రత్యేక దృష్టి సారించి ప్రభుత్వ చొరవతో పనులు ముందుకు సాగుతున్నాయి.శుక్రవారం కొత్త పల్లి పంచాయతీ పరిధిలోని దానం బట్టి రాధా నగర్ నందు దాదాపు 1200 మీటర్ల నూతన మంచినీటి పైప్లైన్ నిర్మాణ పనులకు సర్పంచ్ కొన్ని రెడ్డి భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు.గడచిన 30 ఏండ్లుగా ఇక్కడి ప్రజలు మౌలిక వసతులకు దూరంగా ఉన్నారని తెలిపారు.