నిరుద్యోగులను నిట్ట నిలువునా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని,ఇలాంటి పార్టీని ఓడించి తగిన బుద్ధి చెప్పాలని ఓయూ జేఏసీ నేతలు భిక్షాటన కార్యక్రమాన్ని నిర్వహించి, నిరసన వ్యక్తం చేశారు. పెద్దమ్మ గుడి వద్ద ఓయూ జేఏసీ విద్యార్థినేతల భిక్షాటన చేశారు. పోటీ పరీక్షలకు సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా నోటిఫికేషన్ ఇవ్వకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు.