సర్వేపల్లి: కర్నూలు బస్సు ప్రమాదం., అత్యంత విషాదకరం : సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి
కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంలో 22 మందికి పైగా ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరమని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ఈ ప్రమాదంలో నెల్లూరు జిల్లాకు చెందిన రమేష్ కుటుంబం సజీవదహనం కావడం మరింత బాధాకరమని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఈ ఘటనపై విచారం వ్యక్తం చేస్తున్నారని.. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని శుక్రవారం మధ్యాహ్నం తెలిపారు.