కొత్తగూడెం: కాలానుగుణ వ్యాధుల పట్ల అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి జిల్లా వైద్యారోగ్య అధికారి జయలక్ష్మి
బుధవారం మధ్యాహ్నం నాలుగు గంటలకు జిల్లా వైద్యారోగ్య అధికారి డాక్టర్ ఎస్ జయలక్ష్మి వరద పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాలానుగుణ వ్యాధుల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించేలా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.