పలమనేరు: 50ఏళ్లుగా ఇక్కడే ఉన్నా కూడు,గుడ్డ,ఇల్లు లేదు, ఎవరూ పట్టించుకోవడం లేదు అంటూ ఆవేదన ఆగ్రహం వ్యక్తం చేస్తున్న షికారీలు
వి.కోట: మండలం శివారున స్థావరాలు ఏర్పరచుకున్న షికారులు మీడియా తెలిపిన సమాచారం మేరకు. గత 50 సంవత్సరాల నుండి ఇదే ప్రాంతంలో ఉన్నాము ఇప్పటివరకు మాకు సొంత ఇల్లు లేదు కట్టుకోవడానికి గుడ్డ లేదు తినడానికి తిండి లేదు త్రాగడానికి నీళ్లు లేదు. ప్రభుత్వాలు మారుతున్నాయి మమ్మల్ని ఓట్లు వేసేటప్పుడు మాత్రం అది చేస్తాం ఇది చేస్తామని చెప్తారు ఇప్పటివరకు చేసిందే లేదు. ఇప్పుడు ఉన్న స్థలంలోనే కాలీ చేయమంటున్నారు 50 ఏళ్ల నుండి ఇక్కడే ఉన్నాం చచ్చిన బతికినా ఇక్కడే మీరేం చేసుకుంటారో చేసుకోండి అంటూ ఆవేదన ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ ఘటనపై సీఎం,డిప్యూటీ సీఎం పట్టించుకుని షికారులను పట్టించుకోవాలని కోరారు.