కలికిరి మండలంలో గడిచిన ఐదు నెలల్లో భారీ పెరిగిన క్రిమినల్ మరియు రోడ్డు ప్రమాద కేసులు
కలికిరి మండలంలో గడిచిన ఐదు నెలల్లో క్రిమినల్ మరియు రోడ్డు ప్రమాద కేసులు,అనుమానాస్పద కేసులు భారీగా పెరిగినట్లు లెక్కలు చెబుతున్నాయి. జిల్లాలో క్రైం రేట్ తగ్గాలని, అవగాహన కార్యక్రమాలు, రాత్రి గస్తీలు నిర్వహించాలని పదేపదే ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఐపిఎస్ హెచ్చరికలు జారీ చేసిన కలికిరిలో అవి బుట్టదాఖలయ్యాయి. దీంతో రోడ్డు ప్రమాద కేసులు,అనుమానాస్పద కేసులు, ఆత్మహత్య కేసులు,హత్యాయత్నం కేసులు,ఘర్షణ కేసులు గడిచిన ఐదు నెలల్లో వీపరితంగా పెరిగాయి. దీంతో కలికిరి మండల ప్రజల్లో భయాందోళన నెలకొంది. అంతే గాకుండా కొన్ని రోడ్డు ప్రమాద కేసులు,ఇతర కేసులు నీరు గార్చే ప్రయత్నం చేశారని ఆరోపణలు ఉన్నాయి