మహబూబాబాద్: సత్యవతి గారు ఇది మీస్థాయికి తగిన పనేనా, డిప్యూటీ స్పీకర్ డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రనాయక్ ఆగ్రహం
సత్యవతి గారు.., ఇది మీ.. స్థాయికి తగిన పనేనా.అని డిప్యూటీ స్పీకర్ డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రనాయక్ అన్నారు ,మహానటి సావిత్రి ని మరిపించేలా నిన్న మీరు.. గుండ్రాతిమడుగులో నటించారని ,యూరియా ఇవ్వని కేంద్రాన్ని వదిలి..రైతులకోసం కష్టపడుతున్న రాష్ట్రప్రభుత్వం పై విమర్శలా. ప్రజలు ప్రతీది గమనిస్తున్నారు. మళ్ళీ ఒకసారి స్థానిక ఎన్నికల్లో గట్టిగా మీకు బుద్దిచెబుతారు.. మహబూబాబాద్ జిల్లా రైతాంగానికి యూరియా సక్రమంగా అందించడం కోసం అవిశ్రాంతంగా పనిచేస్తున్న జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, అన్ని శాఖల అధికారులకు, సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు