రాయదుర్గం: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ కు వ్యతిరేకంగా పట్టణంలో కదంతొక్కిన వైసిపి శ్రేణులు, తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ రాయదుర్గం పట్టణంలో వైఎస్సార్సీపీ శ్రేణులు కదంతొక్కారు. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపుతో బుధవారం ఉదయం రాయదుర్గం పట్టణంలోని వినాయక కూడలి నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకూ ఆ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మెట్టువిశ్వనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో వందలాది మంది పార్టీ నాయకులు కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. విద్యా, వైద్యం ప్రజల హక్కు అని, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆపాలని పెద్ద ఎత్తున నినదించారు. అనంతరం వినతిపత్రం అందజేశారు.