మేడిపల్లి: కథలాపూర్ మండల కేంద్రంలోని ఐకేపి ఆధ్వర్యంలో మహిళలకు పాడి పశువులు పెరట్లో కోళ్లు యూనిట్లపై శిక్షణ
కథలాపూర్ మండల కేంద్రంలోని రైతు వేదిక ఐకెపి ఆధ్వర్యంలో మహిళలకు బుధవారం సాయంత్రం పాడిపశువులు, పెరట్లో కోళ్లు యూనిట్లపై శిక్షణ ఇచ్చినట్లు మండల పశువైద్యాధికారి శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ మహిళలు యూనిట్ తీసుకున్నవారు కచ్చితంగా వాటిపై అవగాహన కల్పించుకోవాలని, అభివృద్ధి దిశలో ముందుకెళ్లాలని కోరారు,ఈ కార్యక్రమంలో ఏపిఎం నరహరి, పశువైద్యాధికారి దివ్య సీసీలు తదితరులు పాల్గొన్నారు.