కుప్పం: పౌష్టికాహారం కిట్లు పంపిణీ
గుడిపల్లి(M) తాడేపల్లి అంగన్వాడీ కేంద్రంలో కుప్పం ఏఎంసీ డైరెక్టర్ భానుమూర్తి పౌష్టికాహారం కిట్లను పంపిణీ చేశారు. ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు క్రమంతప్పకుండా పౌష్టికాహారం అందిస్తోందన్నారు. వాటిని సకాలంలో పంపిణీ చేయాల్సిన బాధ్యత అంగన్వాడీ సిబ్బందిపై ఉందన్నారు. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పౌష్టికాహారం కిట్లను అందివ్వాలని సూచించారు.