రాయదుర్గం: భైరవానితిప్ప ప్రాజెక్టుకు భారీగా తగ్గిన ఇన్ ఫ్లో
రాయదుర్గం నియోజకవర్గంలోని భైరవానితిప్ప ప్రాజెక్టుకు ఇన్ ఫ్లో తగ్గింది. ఆదివారం ఉదయానికి ఇన్ ఫ్లో కేవలం 800 క్యూసెక్కులు మాత్రమే వస్తోందని డ్యాం అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. దీంతో 6వ నెంబర్ గేటును ఒక అడుగుకంటే తక్కువ ఎత్తి 654 క్యూసెక్కుల నీరు వేదవతి-హగరి నదికి విడుదల చేస్తున్నట్లు తెలిపారు. రిజర్వాయర్ లో ప్రస్తుత నీటి మట్టం 1653.8 అడుగులు ఉందన్నారు.