గుంతకల్లు: ఊబిచర్ల గ్రామంలో 200 ఎకరాల్లో వేరుశనగ పంట దెబ్బతినింది: సీపీఎం జిల్లా కమిటీ సభ్యురాలు నిర్మల
గుత్తి మండలం ఊబిచర్ల గ్రామంలో మొత్తం 200 ఎకరాల్లో వేరుశనగ పంట పూర్తిగా దెబ్బతినిందని సీపీఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యురాలు నిర్మల అన్నారు. ఊబి చర్ల లో మంగళవారం సీపీఎం నాయకులు వేరుశనగ పంట పొలాలను పరిశీలించారు. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు వేరుశనగ పంట దెబ్బతినిందని రైతులు సీపీఎం నాయకుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా నిర్మల మాట్లాడారు. ప్రభుత్వం ఎకరాకు రూ. 50 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు.