ప్రజా సమస్యల పరిష్కారానికి తక్షణమే కృషి చేయాలని అధికారులను ఎంపీపీ అమూల్య ఆదేశించారు. బుధవారం కొమరోలు మండలంలోని మండల అభివృద్ధి కార్యాలయంలో ఎంపీపీ అమూల్య ఆధ్వర్యంలో సర్వసభ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని ప్రజా సమస్యలపై అధికారతో కలిసి ప్రజాప్రతినిధులు చర్చించి ప్రజల సమస్యలను తక్షణమే పరిష్కరించే విధంగా చూడాలని ఎంపీపీ అమూల్య అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.