మెదక్: చేగుంట లోని ఎస్సీ, బీసీ వసతి గృహాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
Medak, Medak | Sep 19, 2025 చేగుంట మండలంలో ఎస్సీ బీసీ సంక్షేమ వసతి గృహాలను పరిశీలించి విద్యార్థుల మౌలిక వసతులు, విద్యా సామర్థ్యాలు, నాణ్యమైన మెనూ తదితర అంశాలపై క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అన్ని సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు వసతి గృహాల్లోమౌలిక వసతులపై మరమ్మత్తులు నిర్వహించి సౌకర్యాలు మెరుగుపరుచుటకు ఇంజనీరింగ్ అధికారులు తయారు చేసిన నివేదికల ఆధారంగా చేగుంట మండలంలో ఎస్సీ బీసీ వసతి గృహాలను పరిశీలించడం జరిగిందని తెలిపారు.. అన్ని సంక్షేమ వసతి గృహాల ఆశ్రమ పాఠశాలల వార్డెన్స్ రెసిడెన్షియల్ పాఠశాల ప్రిన్సిపాల్, గురుకులాల ఆర్ సి ఓ లు త్వరలో సమావేశం నిర్వహిస్తామన్నారు.