ఒంగోలులోని స్పా సెంటర్ పై ఆకస్మిక తనిఖీ చేసి ఇద్దరిపై కేసు నమోదు చేసిన పోలీసులు
Ongole Urban, Prakasam | Oct 18, 2025
చట్టవ్యతిరేక, అసాంఘిక మరియు అనైతిక కార్యకలాపాలు కట్టడే లక్ష్యంగా ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు మహిళ పోలీస్ స్టేషన్ సిఐ సుధాకర్ ఆధ్వర్యంలో ఒంగోలు టాస్క్ ఫోర్స్ సిబ్బంది శనివారం ఒంగోలు టౌన్ లోని నెల్లూరు బస్టాండ్ సెంటర్ లో ఉన్న స్పా సెంటర్స్ పై తనిఖీలు నిర్వహించారు. ఒంగోలు, నెల్లూరు బస్టాండ్ వద్ద ఉన్న స్పాసెంటర్ లో నిర్వాహకురాలు మరియు అసాంఘిక కార్యక్రమాలకు పాల్గొనేందుకు వచ్చిన పసుపులేటి భాను ప్రకాష్,అనే వ్యక్తిపై మరియు స్పా సెంటర్ల నిర్వాహకులు కోడికల్ల అర్చన పై ఒంగోలు టు టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదు చేశారు.