లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండండి : సీఐ ఏవి రమణ
Gudur, Tirupati | Oct 22, 2025 లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వెంకటగిరి CI వెంకటరమణ సూచించారు. వెంకటగిరి. సర్కిల్ పరిధిలోని మండలాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయని చెప్పారు. కైవల్య, గొడ్డేరు వాగుల ద్వారా ఎక్కువగా వాటర్ ఫ్లో అయ్యే అవకాశాలు ఉన్నాయన్నారు. వెంకటగిరి, బాలాయపల్లి, డక్కిలి మండలాల్లో లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.