మెదక్: ప్రమాదవశాత్తు పంచాయతీ కార్మికుడు చెరువులో పడి మృతి
Medak, Medak | Sep 21, 2025 పంచాయతీ కార్మికుడు చెరువులో పడి మృతి పంచాయతీ కార్మికుడు చెరువులో పడి మృతి చెందిన సంఘటన మెదక్ చిన్నశంకరంపేట మండలం రుద్రారంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన పుల్లగల రాజు చందంపేట గ్రామపంచాయతీలో పంచాయతీ పారిశుద్ధ్య కార్మికుడిగా నిధులు నిర్వహిస్తున్నాడు. గ్రామంలోని చెరువులోకి స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందినట్లు స్థానికులు ఆదివారం సాయంత్రం తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.