ప్రకాశం జిల్లా దోర్నాల పట్టణంలో మతసామరస్యం వెల్లివిరిసింది పట్టణానికి చెందిన ముస్లిం మైనార్టీ నాయకులు షేక్ షేక్షావలి అయ్యప్ప మాలదారులకు అల్పాహారాన్ని అందించారు. ఆలయ గురు స్వాములు భజన కార్యక్రమం నిర్వహించిన అనంతరం దాదాపు 100 మంది భక్తులకు షేక్షావలి అల్పాహార విందును స్వయంగా వడ్డించి వారితో పాటు విందు చేశారు. కుల మతాలు వేరైనా సమాజంలో అందరూ సమానమేనని ఇలాంటి కార్యక్రమాలు దేశ ఐక్యతను చాటుతాయని పలువురైనను అభినందించారు.