పిఠాపురం: మాజీ ఎమ్మెల్యే వర్మ కు మాజీ ఎంపీ పిఠాపురం వైసిపి ఇన్చార్జ్ వంగా గీత కౌంటర్
కాకినాడ జిల్లా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ చేసిన వ్యాఖ్యలకు మాజీ ఎంపీ వైసీపీ ఇన్ఛార్జ్ వంగా గీత కౌంటర్ ఇచ్చారు. మా తమ్ముడు వర్మ సినిమాకి వెళ్తే, భోజనాల కోసం లైన్లలో ఉండరా అంటూ రైతులను వర్మ అవహేళన చేశారని ఆమె విమర్శించారు. కూటమి ప్రభుత్వం రైతులకు చేసిందేమీ లేదని, పిఠాపురం నియోజకవర్గ రైతులకు తక్షణమే యూరియా అందించాలని సోమవారం ఉదయం 11 గంటలకు మీడియా పూర్వకంగా డిమాండ్ చేశారు.