నంద్యాల జిల్లా రుద్రవరం మండలస్థాయి ఉపాధ్యాయుల త్రో బాల్ పోటీల్లో పాల్గొని డివిజన్ లెవెల్ కు ఎంపికైన మహిళా ఉపాధ్యాయులకు మండల విద్యాశాఖ అధికారి వీర రాఘవయ్య ఆదివారం టీషర్ట్ పంపిణీ చేశారు, ఈ సందర్భంగా విద్యాశాఖ అధికారి మాట్లాడుతూ మండల మహిళా ఉపాధ్యాయ క్రీడాకారులు డివిజనల్ స్థాయిలో కూడా మంచి ప్రతిభ కనబరిచే జిల్లా స్థాయి పోటీలకు ఎంపిక కావాలన్నారు, ఈ కార్యక్రమంలో హెచ్ఎం వెంకట్ రమణ పీఈటీలు ధర్మరాజు దాస్ శ్రీనివాసులు రజియా సుల్తానా పాల్గొన్నారు