బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్
శ్రీ సత్య సాయి జిల్లా కదిరి పట్టణంలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో సోమవారం సీఎం సహాయ నిధి నుంచి విడుదలైన చెక్కులను బాధితులకు కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ అందజేశారు. మొత్తం 32 మంది బాధితులకు 29,32,000 రూపాయలను చెక్కుల రూపంలో అందజేశారు.