మల్కాజిగిరి డివిజన్ మారుతి నగర్ మెయిన్ రోడ్డు పైన ఉన్నటువంటి 1000 గజాలలో నూతన పార్క్ మరియు లైబ్రరీ రూమ్ పనులకు కార్పొరేటర్ శ్రవణ్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నో వ్యయ ప్రయాసాల కూర్చి ప్రభుత్వ భూమి కబ్జా కాకుండా కాపాడి, ఇక్కడ ఒక పార్కు మరియు లైబ్రరీ నిర్మిస్తున్నామని అన్నారు. ప్రజలు భవిష్యత్ తరాలకి, పిల్లలకు విద్యను అందించే విధంగా లైబ్రరీ రూమ్ ని తీర్చిదిద్దుకుందామని, జ్ఞాన భాండాగారంగా తీర్చిదిద్దుకుందామని అన్నారు. పార్కులను అభివృద్ధి చేయడం ద్వారా ఎక్ససైజ్ లాంటివి చేసుకోవడం, షటిల్ లాంటివి ఆడుకోవడానికి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అవకాశం ఉందన్నారు.