పెడనలో మున్సిపల్ పైపు పగిలి, రేకులు ఎగిరిపడి పలువురికి గాయాలు
Machilipatnam South, Krishna | Sep 17, 2025
పెడనలో మున్సిపల్ పైప్లైన్ పగిలిపోవడంతో ఎదురింటిపై రేకులు ఎగిరిపడి, రోడ్డుపై వెళ్తున్న పలువురు గాయపడ్డారు. గుడివాడ-మచిలీపట్నం రోడ్డులోని గేటు వద్ద బిర్యాని పాయింట్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ సంఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.