కనిగిరి: వెలిగండ్ల మండలంలో వైసీపీకి షాక్, ఎంపీపీ తో సహా ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి సమక్షంలో పలువురు టిడిపిలో చేరిక
వెలిగండ్ల మండలంలో వైసీపీకి షాక్ తగిలింది. ఆ మండలానికి చెందిన కీలకమైన నేతలు కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి సమక్షంలో కనిగిరి టిడిపి కార్యాలయంలో ఆదివారం వైసీపీని వీడి టిడిపిలో చేరారు. వైసీపీకి చెందిన వెలిగండ్ల మండల ఎంపీపీ రామన మహాలక్ష్మి, వైస్ ఎంపీపీ నాగూర్ యాదవ్, మాజీ జెడ్పిటిసి రామన తిరుపతిరెడ్డి తోపాటు కొట్టాలపల్లి సర్పంచ్ భాస్కర్ రెడ్డి, మరో 160 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... అందరం కలిసి కనిగిరి నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేద్దామని అన్నారు.