ప్రకాశం జిల్లా కొండేపి మండలం వెన్నూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం పథకాన్ని గురువారం జిల్లా విద్యాశాఖ ఏడీ వరప్రసాద్ ఆకస్మిక తనిఖీ చేశారు. తనిఖీలు వంటగది పరిసర ప్రాంతాలు స్టోర్ రూమ్, బాలికల టాయిలెట్స్లను పరిశీలించారు. గుడ్లు, చికెన్, రాగి పిండి, నూనె, బెల్లం ఎంత వస్తుంది కూడా రికార్డులతో సరి పోలుస్తూ పరిశీలించారు. భోజనం రుచి చూసి రుచికరంగా ఉందని సంతృప్తి వ్యక్తం చేశారు.