కడప జిల్లా పులివెందుల పట్టణంలోని బాక్రాపురంలో ఉన్న వైయస్సార్ ఆడిటోరియంలో గురువారం వైసీపీ పార్టీ ఆధ్వర్యంలో ప్రజా వైద్యం ప్రజల హక్కు పేరుతో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సదస్సును ఎంపీ అవినాష్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లోని ప్రతి ఇంటికి వెళ్లి మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంతకాలు చేయించి ప్రజల మద్దతు కూడగట్టాలన్నారు. అనంతరం ఎంపీ అవినాష్ రెడ్డి తొలి సంతకం చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ ముఖ్య నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.