కొత్తూరు శివాలయం కాలనీలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మద్యం మత్తులో జరిగిన గొడవలో బీరు సీసాతో పొడిచి, అనంతరం బండరాయితో తలపై మోది హత్య చేసినట్లు పోలీసులు ఆదివారం ప్రాథమికంగా నిర్ధారించారు. హైదరాబాద్కు చెందిన ముగ్గురు యువకులు మద్యం సేవించిన అనంతరం పరస్పరంగా గొడవకు దిగారు. ఈ క్రమంలో ఒకరిపై తీవ్రంగా దాడి చేయడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందినట్లు అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.