తాడేపల్లిగూడెం: తాడేపల్లిగూడెం అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థులుగా మంగళవారం నలుగురు అభ్యర్థులు నామినేషన్ లు దాఖలు.
సార్వత్రిక ఎన్నికలు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియలో ఐదవ రోజున నలుగురు అభ్యర్ధులు ఒక్కో సెట్టు చొప్పున నామినేషన్ పత్రాలు దాఖలు చేసినట్లు 62- తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి కె .చెన్నయ్య తెలిపారు.ఆయన మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు మాట్లాడుతూ బహుజన సమాజ పార్టీ అభ్యర్థిగా తాడేపల్లిగూడెం కు చెందిన కొత్తపల్లి.వెంకటేశ్వరరావు స్వతంత్ర అభ్యర్థులుగా పెంటపాడు మండలం పత్తిపాడు గ్రామానికి చెందిన సిరివరపు సింహాచలం,తాడేపల్లిగూడెం మండలం కడియద్ద గ్రామానికి చెందిన పెద్ద మూర్తి రాజేంద్ర, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అభ్యర్థిగా వీరవాసరం మండలం అండలూరు గ్రామానికి చెందిన మేక వెంకటేశ