అసిఫాబాద్: కొమురం భీం ప్రాజెక్టు ఒక గేటు ఎత్తివేత
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షానికి కొమురం భీం ప్రాజెక్టుల్లోకి 660 క్యూసెక్కుల వరద వచ్చి చేరింది. దీంతో ప్రాజెక్టు అధికారులు శనివారం ఉదయం ప్రాజెక్టులోని ఒక గేటును 0.3మీటర్ల మేర ఎత్తి 590 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. ప్రాజెక్టు నీటిమట్టం 243 మీటర్లు కాగా..ప్రస్తుతం 238 మీటర్లకు చేరింది.దీంతో దిగువ గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రాజెక్టు అధికారులు సూచించారు.