అన్నమయ్య :పింఛా డ్యాం వరదకు రహదారి ధ్వంసం...చిన్నబిడికి–రాసపల్లి మధ్య రాకపోకలకు అంతరాయం
అన్నమయ్య జిల్లా: పింఛా డ్యాం ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా డ్యాంకు వరద ప్రవాహం పెరిగింది. దీంతో డ్యాం అధికారులు గేట్లు ఎత్తి నీటిని భారీగా నదిలోకి విడుదల చేశారు. ఒక్కసారిగా నీటి మోతాదు పెరగడంతో చిన్నబిడికి–రాసపల్లి మధ్య ఉన్న రహదారి పూర్తిగా కొట్టుకుపోయింది.ఈ సంఘటనతో రెండు ప్రాంతాల మధ్య వాహనాల రాకపోకలు నిలిచిపోయి, మాచిరెడ్డిగారి పల్లె ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అత్యవసర అవసరాల కోసం కూడా ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించే పరిస్థితి ఏర్పడింది.ప్రాంతంలో పరిస్థితిని అధికారులు పర్యవేక్షిస్తూ, దెబ్బతిన్న రహదారి పునరుద్ధరణకు చర్యలు ప్రారంభించినట్లు