ఆసిఫాబాద్ పట్టణంలో దోమల నియంత్రణకు ఫాగింగ్ చేసినట్లు ఆసిఫాబాద్ మున్సిపల్ కమిషనర్ గాజానంద్ తెలిపారు. సోమవారం రాత్రి పట్టణంలోని తారక రామారావు నగర్ కాలనీలో మున్సిపల్ సిబ్బంది దోమలు రాకుండా ఫాగింగ్ చేశారు. దోమల వృద్ధి కేంద్రాలను గుర్తించి ఆయా ప్రాంతాలలో యాంటీ లార్వా ఆపరేషన్లు చేపడుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.