మేడ్చల్: బోడుప్పల్ లో బైక్ చోరీ చేసిన జంట
మేడ్చల్ జిల్లాలో మరో బైక్ చోరీ కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మేడిపల్లి పరిధి బోడుప్పల్ లోని సాయిరాం నగర్ కాలనీలో ఈ చోరీ ఘటన చోటుచేసుకుంది. ఓ యువతి, యువకుడు ఒకరి ఇంట్లో బైక్ నీ దొంగలు దొంగలించారు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఈ ఘటన పట్ల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.