ఏటూరునాగారం: ములుగును మావోయిస్టు రహిత జిల్లాగా మారుస్తాం: ఎస్పీ శబరిష్
మావోయిస్టు రహిత జిల్లాగా ములుగును మార్చడం కోసం ములుగు పోలీసులు అహర్నిశలు కృషి చేస్తున్నారని ములుగు జిల్లా ఎస్పీ డాక్టర్ శబరిష్ ఐపిఎస్ నేడు ఆదివారం రోజున మధ్యాహ్నం 3 గంటలకు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజల రక్షణ ధ్యేయంగా మరియు శాంతి భద్రతలు అదుపులో ములుగు జిల్లా పోలీసులు ఎల్లప్పుడు సిద్ధంగా ఉంటారని అన్నారు. ములుగు పోలీసులు మావోయిస్టు కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ మరియు మావోయిస్టుల లొంగుబాటు కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేయడం వల్ల పెద్ద ఎత్తున సిపిఐ మావోయిస్టు సభ్యులు మరియు నాయకులు లొంగిపోవడం జరుగుతుందన్నారు.