మార్కాపురం జిల్లా తర్లపాడు మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన వారు గతంలో అనారోగ్యంతో బాధపడుతూ హాస్పిటల్లో చికిత్స తీసుకున్నారు. వారధికంగా ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో సీఎం సహాయనిధి నుండి వచ్చిన చెక్కులను ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి సతీమణి వసంతలక్ష్మి అందజేశారు. మార్కాపురం పట్టణంలో సుమారు 6 మందికి మరియు తర్లపాడు లో ముగ్గురికి సుమారు 7 లక్షల 23,191 రూపాయలు చెక్కును అందజేసినట్లు వసంతలక్ష్మి తెలిపారు.