పాతకక్షలతో మహిళ పై దాడి
రాజంపేట: పాత గొడవలను మనసులో పెట్టుకొని ఆదివారం రాత్రి ఇంటి నుండి అంగడికి వచ్చి కావాల్సిన వస్తువులు తీసుకుని తిరిగి ఇంటికి వెళ్లే మార్గమధ్యంలో దారిలో కాపు కాచి మహిళపై పైశాచిక దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన సంఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే రాజంపేట మండల కేంద్రంలోని పెద్ద కారం పల్లి గ్రామపంచాయతీలో చెంచు కాలనీలో నివాసం ఉన్నటువంటి సింగనమైన చిరంజీవి భార్య అలివేలు (20) ఆదివారం రాత్రి అన్నమయ్య నగర్ లో ఉన్నటువంటి దుకాణానికి వచ్చి కావాల్సిన వస్తువులు తీసుకొని తిరిగి ఇంటికి వెళుతుండగా మార్గమధ్యంలో కాపు కాచి అన్నమయ్య నగర్ కు చెందిన వైసిపి నాయకులు రాగి సవడయ్య, రాగే కు