హిమాయత్ నగర్: సికింద్రాబాద్ వస్తున్న ఫలక్నామ ఎక్స్ప్రెస్ లో ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు
ఫలక్నామ ఎక్స్ప్రెస్ లో ఉగ్రవాదుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టడం స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శుక్రవారం ఉదయం జిఆర్పి ఆర్పీఎఫ్ ఘట్కేసర్ పోలీసులు సంయుక్తంగా ఘట్కేసర్ రైల్వే స్టేషన్ లో హౌరా నుంచి సికింద్రాబాద్ వస్తున్న ఫలక్నామ ఎక్స్ప్రెస్ లో ప్రతిబోగినీ క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. దాదాపు పోలీసులు గంటసేపు తనిఖీలు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.