గిద్దలూరు: బేస్తవారిపేట అమరావతి అనంతపురం జాతీయ రహదారిపై కారు ద్విచక్ర వాహనం ఢీ, ఒక్కరు మృతి, మరో ఇద్దరికి గాయాలు
మార్కాపురం జిల్లా బేస్తవారిపేట పట్టణంలోని అమరావతి అనంతపురం, జాతీయ రహదారి ఫ్లైఓవర్ పై శనివారం కారు ద్విచక్ర వాహనం ఢీకొని ఒకరు మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డ సంఘటన చోటుచేసుకుంది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ఇద్దరినీ అంబులెన్స్ లో కంభం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడు, క్షతగాత్రులు నంద్యాల జిల్లా గాజులపల్లి గ్రామానికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. జరిగిన ప్రమాదంపై స్థానిక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.