ఇబ్రహీంపట్నం: సీఎం రేవంత్ రెడ్డిపై వస్తున్న ఆరోపణలపై ఆయన వివరణ ఇవ్వాలి: మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి
మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆదివారం మధ్యాహ్నం తెలంగాణ భవన్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మంత్రి కొండ సురేఖ కూతురు చేసిన ఆరోపణలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి పై వస్తున్న ఆరోపణలు సాధారణమైనవి కావు అని అవి ఆయన సన్నిహితుల నుంచే వస్తున్నాయని దీనిపై వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి అత్యంత సన్నిహితుడే సెటిల్మెంట్లో కూర్చున్నాడని ఆయనకి ఇందులో హస్తము ఉందని తెలిపారు. పోలీసులు స్టేట్మెంట్ను బయటపెట్టాలని తెలిపారు.