ఉపాధి హామీ పనులపై సమీక్ష సమావేశం: ఎంపీడీవో శ్రీనివాసులు
శ్రీ సత్యసాయి జిల్లా నల్లమాడ మండల ప్రజా పరిషత్తు కార్యాలయంలో బుధవారం మధ్యాహ్నం ఉపాధి హామీ సిబ్బందితో సమీక్ష సమావేశం ఎంపీడీవో శ్రీనివాసులు, ఏపీఓ రఘునాథరెడ్డి నిర్వహించారు. మండలంలో ఉపాధి పనులు విరివిగా కల్పించాలని వారన్నారు. జాబ్ కార్డ్ ఉన్న ప్రతిఒక్కరినీ ఈకేవైసీ వేయించాలన్నారు. మండలాన్ని ప్రగతిప థంలో ఉంచాలని టీఏ, ఎఫ్ఎలను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో JE శ్రీనివాస రెడ్డి, ఫీల్డ్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు.