అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నం మండలంలో అత్యంత ప్రమాదకరమైన మలుపులను గుర్తించి అటువంటి చోట్ల పోలీస్ ఫ్లెక్సీలు బోర్డులు ఏర్పాటు చేశామని ఎస్సై షరీఫ్ తెలిపారు. ఆదివారం ఉదయం 11 గంటలకు దీనికి సంబంధించిన వివరాలు తెలిపారు. ఫజుల్లాబాద్ గ్రామం దాటిన తరువాత కొండ వద్ద ప్రాంతంలో అత్యంత ప్రమాదకరమైన మలుపు ఉందని చెప్పారు. ఇక్కడ పోలీస్ కు సంబంధించిన పెద్ద ఫ్లెక్సీ బోర్డు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఇందుకూరు గ్రామ సమీపంలో పోతవరం వెళ్లే మార్గమధ్యలో మరో రెండు చోట్ల ప్రమాదకరమైన మలుపులు ఉన్నాయని తెలిపారు. ప్రమాదాల నివారణకు ఈ విధంగా ఏర్పాటు చేసినట్లు చెప్పారు.