తలుపుల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్
ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాల సంఖ్య పెరిగేలా చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్య సిబ్బందిని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదేశించారు.శుక్రవారం పీలేరు మండలం తలపుల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్... ఆసుపత్రికి సంబంధించిన ఓపి రిజిస్టర్, డిస్పెన్సరీ రిజిస్టర్ తదితర రిజిస్టర్ లను పరిశీలించి ఆసుపత్రి సిబ్బందిని ప్రశ్నలు అడిగారు. చిన్న పిల్లలకు టీకాలు ఎప్పుడు ఎప్పుడు వేస్తున్నారు. ఎలా వేస్తున్నారు వంటి ప్రశ్నలు అడిగారు. చిన్న పిల్లలకు వేసే టీకాలపై ప్రజలలో అవగాహన కల్పిస్తున్నారా అని అడిగారు