కొండపి: కనుమ పండుగ సందర్భంగా సింగరాయకొండ మండలంలో శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి తెప్పోత్సవం
ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలంలోని శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి తెప్పోత్సవ కార్యక్రమం శుక్రవారం అంగరంగ వైభవంగా జరిగింది. గ్రామ చెరువులో తేప్పోత్సవం నిర్వహించగా స్థానికులు భారీగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ప్రతి కనుమ పండుగ సందర్భంగా అనాదిగా శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి తెప్పోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. స్వామివారిని దర్శించుకుని భక్తులు తమ మొక్కులు చెల్లించారు.