అనంతపురం నగరంలోని గుత్తి రోడ్డు జాతీయ రహదారిపై గ్యాంగ్ వార్
Anantapur Urban, Anantapur | Oct 21, 2025
అనంతపురం నగరంలోని గుత్తి రోడ్డులో జాతీయ రహదారిపై గ్యాంగ్ వార్ ను తలపిస్తూ మంగళవారం మధ్యాహ్నం ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. బిందెల కాలనీకి చెందిన నాగరాజు అతని అనుచరులు గుణ అనే వ్యక్తిపై రాళ్లతో విచక్షణ రహితంగా దాడి చేసి గాయపరిచిన సంఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి ప్రస్తుతం అనంతపురం నగరంలో సంచలనం సృష్టిస్తుంది.