కోడుమూరు: కోడుమూరుకు చెందిన జనసేన కార్యకర్త కుటుంబానికి ప్రమాద భీమా చెక్ అందించిన ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు
కోడుమూరు పట్టణానికి చెందిన బండ శ్రీనివాసులు కుటుంబానికి ఆ పార్టీ ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు రూ. 5 లక్షల రూపాయల ప్రమాద బీమా చెక్కు అందించారు. గత 8 నెలల క్రితం బండ శ్రీనివాసులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. దీంతో ఆయనకు ప్రమాద బీమా మంజూరయ్యింది. బాధిత కుటుంబం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలిపారు.