సైబర్ నేరాలపట్ల నిరంతరం అప్రమత్తంగా ఉండాలని కోవెలకుంట్ల సీఐ హనుమంతు నాయక్ ప్రజలను హెచ్చరించారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. అపరిచితులు పంపే మెసేజ్లకు రిప్లై ఇవ్వొద్దన్నారు. బ్యాంక్ లావాదేవీలు, పిన్/ఓటీపీ, తదితర నంబర్లను వేరే వ్యక్తులకు తెలియపరచొద్దన్నారు. చిన్న విషయాలకు ఆశపడి నగదు కోల్పోవద్దని సూచించారు. సైబర్ క్రైమ్ జరిగితే వెంటనే 1930కి కాల్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు.