జమ్మలమడుగు: కొత్త తిరువెంగళాపురం : గ్రామంలో నేషనల్ హ్యూమన్ రైట్స్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం
కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం పరిధిలోని పోరుమామిళ్ల మండలం రాజాసాహెబ్ పేట లోని కొత్త తిరువెంగళాపురం మరియు కొత్త వెంకటాపురం నందు ఆదివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. నేషనల్ హ్యూమన్ రైట్స్ రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ ముత్యాల ప్రసాద్ రావు ఆధ్వర్యంలో ఆరోగ్యం క్లినిక్ డాక్టర్ సుజిత్ కుమార్ ఆధ్వర్యంలో దాదాపు 300 మందికి ఉచిత వైద్య శిబిరం ద్వారా అన్ని రకాల జబ్బులకు మరియు బీపీ షుగర్ వైద్యం చేసి ఉచితంగా మందులు ఇచ్చారు.ఈ సందర్బంగా డాక్టర్ సుజిత్ కుమార్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో పేద ప్రజలకు అన్ని రకాల జబ్బులకు ప్రతివారం రోజు ఒక గ్రామంలో శిబిరం ఏర్పాటు చేస్తున్నామన్నారు