రాయదుర్గం: అప్పుల బాధతో పురుగుల మందు తాగి సింగేపల్లి గ్రామానికి చెందిన రైతు ఆత్మహత్య
పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన బొమ్మనహాల్ మండలం సింగేపల్లికి చెందిన రైతు కురుబమోహన్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. 3 ఎకరాల్లో పత్తి, వరి పంటలు సాగు చేశాడు. పెట్టుబడి కోసం రూ. 5 లక్షలు అప్పులు చేశాడు. తీర్చే మార్గం తోచక ఆదివారం పొలంలోనే పురుగుల మందు తాగాడు. బళ్లారి విమ్స్ కు తరలించి చికిత్స అందించారు. పరిస్థితి విషమించి సోమవారం మృతి చెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.