పత్తికొండ: పత్తికొండ ప్రధాన రహదారిలో వాగులోకి దూసుకెళ్లిన లారీ తప్పిన ప్రమాదం
పత్తికొండ ప్రధాన రహదారిలో గిరిగెట్ల గ్రామ సమీపంలో ఓ లారీ శనివారం లింగాలవారు వంతెన రక్షణ గోడను ఢీకొని వాగులో పడిపోయింది. ఈ ఘటనలో లారీ చోదకుడు స్వల్ప గాయాలతో ప్రమాదం నుంచి బయట పడ్డారు. చెన్నై నుంచి గుజరాతు లారీలో ఇటాచీని తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వంతెనపై పడిన గుంతలను వెంటనే పూడ్చాలని జనం విన్నవిస్తున్నారు. -