అనంతపురం జిల్లా ఉరవకొండ శ్రీ గరిమఠం సంస్థానంలో ఎనిమిదవ పీఠాధిపతి అయిన శ్రీ శ్రీ జగద్గురు చన్నబసవ రాజేంద్ర మహాస్వాముల ఆధ్వర్యంలో ఏడవ పీఠాధిపతి అయిన శ్రీ శ్రీ జగద్గురు కర్త్రు కరిబసవ రాజేంద్ర మహా స్వాముల వారి పుణ్యా ఆరాధన పూజలను శనివారం భక్తజనంతో కలిసి నిర్వహించారు. పూజల్లో భాగంగా శ్రీ గణపతి పూజ రుద్రాభిషేకం పూజలను నిర్వహించారు. తదుపరి మహాత్ముల వారి దివ్య ఆధ్యాత్మిక సందేశ కార్యక్రమాన్ని నిర్వహించి తదనంతరం అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు.