కళ్యాణదుర్గం: అపిలేపల్లి పాఠశాల ఆవరణలో బడి తోట ను సిద్ధం చేయిస్తున్న తల్లిదండ్రుల కమిటీ చైర్మన్, ఉపాధ్యాయులు
కుందుర్పి మండలం అపిలేపల్లి జడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో బడి తోట ను సిద్ధం చేస్తున్నారు. స్కూలు తల్లిదండ్రుల కమిటీ చైర్మన్ చిరంజీవి, ప్రధానోపాధ్యాయులు తిమ్మప్ప, ఉపాధ్యాయులు దగ్గరుండి బడి తోటను సిద్ధం చేస్తున్నారు. ట్రాక్టర్లను ఏర్పాటు చేసి వాటి ద్వారా భూమిని చదును చేయిస్తున్నారు. కేవలం రెండు రోజుల్లో బడి తోట సిద్ధమవుతుందని ప్రధానోపాధ్యాయులు చెప్పారు.